Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (03-08-2024, శనివారం)

నేటి రాశి ఫలాలు (03-08-2024, శనివారం)

మేషం
ఉద్యోగులకు క‌లిసొచ్చే సమయం. అధికారులతో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. బంధువుల‌తో క‌ల‌హాలు ఉండొచ్చు. అనవసరమైన చర్చల‌కు దూరంగా ఉండండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం క‌లిసొస్తుంది. ప్రారంభించిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. శివారాధన శుభప్రదం.

వృషభం
ధనప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యుల‌తో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల‌ను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. వృథా ఖర్చులు ఉంటాయి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయపాలన పాటించండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు చేప‌ట్ట‌వ‌ద్దు. ముందు అనుకున్న వాటిని పూర్తి చేయ‌డంపై దృష్టి పెట్టండి. కోపంతో నూత‌న అవ‌కాశాలు కోల్పోవచ్చు. వైష్ణవాలయాన్ని సంద‌ర్శించండి.

కర్కాటకం
క‌ర్కాట‌క రాశి వారికి అంత‌టా శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గిట్టనివారు పనులు చెడగొట్టడానికి ఎంత ప్రయత్నించినా విఫలమవుతారు. శత్రువుల నుంచి కూడా లాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం
మిశ్రమంగా ఉంటుంది. నిబద్ధతతో ముందుకు అడుగు వేస్తే విజయం వరిస్తుంది. వ్యాపారులకు కిందివారితో కొన్ని ఇబ్బందులు త‌లెత్త‌వ‌చ్చు. కుటుంబసభ్యులతో గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండండి. ఉద్యోగుల‌కు ప‌నిభారం ఎక్కువ‌వుతుంది. మానసిక‌ ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

కన్యా రాశి
క‌న్య‌ రాశి వారికి ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉండటం వల్ల ఊహించని సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి తగాదాలు తొల‌గుతాయి. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల స‌త్ఫ‌లితాలు పొందొచ్చు.

తుల
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స‌మాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన సూచన. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. సోదరులతో సఖ్యతతో మెలగండి. వ్యాపారులకు మంచి సమయం. అదృష్టం కలిసివస్తుంది. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం
గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. ఖర్చుల విష‌యంలో నియంత్రణ అవసరం. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. అధికారులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం అవసరం. శివారాధన వల్ల శుభ ఫలితాలు అధికమవుతాయి.

ధనుస్సు
తాత్కాలిక ప్రయోజనాలున్నాయి. వ్యాపారులకు అనుకూలమైన సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కళా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. పెద్దల సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఆంజనేయస్వామి ఆరాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మకరం
గురు, రాహు సంచారం వల్ల సత్ఫలితాలు పొందుతారు. మంచివారి సహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. వాటిని అమలుపర్చడంలోనూ విజయం సాధిస్తారు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నలుగురికీ సాయం చేస్తారు. ఉద్యోగంలో మంచిపేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. సహోద్యోగులతో ఉన్న సమస్యలు దూరమవుతాయి. పెద్దల అండదండలు ల‌భిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన మేలు చేస్తుంది.

మీనం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు అందుకుంటారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. విందులకు హాజరవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల సూచనలు పాటించడం అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

Recent

- Advertisment -spot_img