Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (04-07-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (04-07-2024, గురువారం)

మేషం
గతంతో పోలిస్తే మేష‌ రాశి వారికి ఆదాయం కాస్త మెరుగ్గానే ఉంటుంది. ఆత్మీయుల‌తో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న విభేదాలు తొల‌గిపోతాయి. ఆలోచనలు కార్య‌రూపం దాలుస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. ఆస్తిప‌రంగా నిలిచిపోయిన అగ్రిమెంట్లు పూర్తి అవుతాయి. ప్రముఖల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు.

వృషభం
కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డుతుంది. చేపట్టిన కార్యక్రమా లు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ‌స‌భ్యుల‌తో ముఖ్య విష‌యాలు చ‌ర్చిస్తారు. విద్యార్థుల కృషి సత్ఫ‌లితాలు అందిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో శ్రమ పెరుగుతుంది. నూత‌న వ‌స్తువులు కొనుగోలుకు ప్ర‌య‌త్నిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ద‌క్కుతాయి. ఉద్యోగులకు ఆటంకాలు తొలగుతాయి.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈరోజు అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయుల‌తో కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలందుకుంటారు. ఉద్యోగులకు ఊహించని రీతిలో ప్రమోషన్లు క‌లిసి వ‌స్తాయి.

కర్కాటకం
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు ఊహించని రీతిలో లాభాలు. ఉద్యోగులకు ఆశించిన మార్పులు.

సింహం
కొంత జాప్యం జరిగినా అనుకున్న కార్యాలు పూర్తి చేస్తారు. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. డబ్బు సకాలంలో సమకూరుతుంది. వాహ‌నయోగం సూచితం. స‌న్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. చేజారిన కొన్ని డాక్యుమెంట్లు తిరిగి దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు క‌లిసి వ‌స్తాయి. ఉద్యోగులకు సంతోషకర సమాచారం అందుతుంది.

క‌న్య‌
ముఖ్యమైన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. స‌మాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. కొత్త‌ ఆలోచనలు అమలుచేస్తారు. వ్యాపారులు లాభాలతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు కొత్త విధుల్లో చేరతారు.

తుల
నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆశించిన ఆదాయం ల‌భిస్తుంది. నిరుద్యోగులకు అనుకున్న అవకాశా లు ఏర్ప‌డ‌తాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. ప్రముఖ వ్యక్తులు కొంత సాయపడతారు. కుటుంబసభ్యులకు అండ‌గా నిలుస్తారు. వ్యాపారులు మరింతగా లాభాలు దక్కించుకుంటారు. ఉద్యో గులకు విధుల్లో అనుకూల ఫలితాలున్నాయి.

వృశ్చికం
ఆదాయం సమృద్ధిగా ఉండి ఎంతటి ఖర్చు ఎదురైనా అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు శుభవార్త వింటారు. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల మ‌ద్ద‌తు ఉంటుంది. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

ధనుస్సు
నేటి రాశి ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈరోజు నూతన విద్యాయత్నాలు కలిసి వస్తాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి ఒడ్డునపడతారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. ఆదాయ, వ్యయాలు సమానం. వాహనసౌఖ్యం క‌ల‌దు. సమాజంలో ప్రత్యేక గౌరవం ల‌భిస్తుంది. వ్యాపారులకు లాభాలు క‌లిసి వ‌స్తాయి. ఉద్యోగులు ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు.

మ‌కరం
రాబడి కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. నూత‌న‌ కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో మనసులోని భావాలు పంచుకుంటారు. విలువైన వస్తువులు కొంటారు. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గేందుకు అవ‌కాశం ఉంది.

కుంభం
కుంభ రాశి వారికి రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది.

మీనం
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. పరి స్థితులు అంతగా అనుకూలించవు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బందిగా మారవచ్చు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితి నెల‌కొంటుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం.

Recent

- Advertisment -spot_img