మేషం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించిన విధంగానే సొమ్ము అందు తుంది. అవసరాలకు సోదరులు ఆదుకుంటారు. కుటుంబంలోని అందరి ఆమోదంతో నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులు కాస్త ఊరట పొందుతారు. శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.
వృషభం
కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. స్నేహితులతో నెలకొన్న తగాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. సమాజంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇతరులు నుంచి రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలు పొందుతారు. దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న విజయాలు సాధిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఆసక్తికర విషయాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. సొమ్ము సకాలంలో అందుతుంది. ఆస్తుల క్రయవిక్రయాలు లాభించి లబ్ది పొందుతారు. కుటుంబంతో సంతోషకరంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. శ్రీశివప్రార్ధన మంచిది.
కర్కాటకం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా అనుకూలంగా మారతారు. రెండుమూడు విధాలుగా ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా ముందుకుసాగుతారు. శ్రీమహావిష్ణు ధ్యానం మంచిది.
సింహం
కీలక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. మిత్రులతో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఒక సంఘటన మీలో కొంత మార్పునకు దారితీస్తుంది. ఆర్ధిక ఇబ్బందులు తీరతాయి. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. ఊహించని విధంగా కొంత సొమ్ము అందుతుంది. కుటుంబంలో సంతోషకతరమైన వాతావరణం. బంధువుల రాక మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు తథ్యం. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీవేంకటేశ్వరస్తుతి మంచిది.
కన్య
అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు లభిస్తాయి. రుణ బాధలు తీరతాయి. ఊహించని రీతిలో మరింత సొమ్ము సమకూరే అవకాశం ఉంది. పలు విషయాల్లో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆప్తులతో గొడవలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తిరీత్యా ఆటంకాలు అధిగమిస్తారు. ఆంజనేయ స్వామిని పూజించండి.
తుల
ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు చాకచక్యంగా దక్కించుకుంటారు. ఖర్చులు అదుపు చేసుకోండి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సొమ్ము సమకూరుతుంది. కుటుంబసభ్యుల్లో మీరంటే ఇష్టం పెరుగుతుంది. బంధువుల రాకతో సందడి నెలకొంటుంది. ఉద్యోగాలలో విధులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఊహించని ఇంక్రిమెంట్లు లభిస్తాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.
వృశ్చికం
కొన్ని పనులు మరింత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు. నిరుద్యోగుల కృషి వృథా అవుతుంది. మానసిక ఆందోళనకు గురి అవుతారు. రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. కుటుంబపరంగా తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురుకాగలదు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు కొంత శ్రమపడాల్సిన సమయం. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు ఎదురుకావచ్చు. మహిళలకు మానసిక అశాంతి. దేవీస్తుతి మంచిది.
ధనుస్సు
సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఆకస్మిక ధనలబ్ది. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరే సమయం. శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సహచరులతో సఖ్యత నెలకొంటుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి వివాదాలు పరిష్కారమవుతాయి. ఊహించని ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రావలసిన డబ్బు చేతికందుతుంది. ఖర్చులు తట్టుకుని నిలబడతారు. మీ నిర్ణయాలకు కుటుంబసభ్యులు గౌరవం ఇస్తారు. వ్యాపార విస్తరణలు ముమ్మరం చేస్తారు. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగుల్లో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. శివపంచాక్షరి పఠించండి.
కుంభం
ముఖ్య వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారడం విశేషం. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణాలు తీరతాయి. కుటుంబంతో ఉత్సాహంగా గడుపుతారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. మీ సమర్థత చాటుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడు తుంది. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించండి.
మీనం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రుల వల్ల సంతోషంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగాలలో కొత్త విధులు మరింత బాధ్యతగా నిర్వహిస్తారు. ఒత్తిడులు తొలగుతాయి. గణేశ స్తోత్రాలు పఠించండి.