మేషం:
అనవసర ఖర్చులు పెడతారు. పొదుపు పాటించండి. శుభకార్య యత్నాలు చేపడతారు. మొహమాటంతో సమస్యలు ఎదుర్కొంటారు. వివాదాలు పరిష్కారమవుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కలసివచ్చే రోజు. ఆందోళనలకు దూరంగా ఉండండి.
వృషభం:
ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలు తలెత్తవచ్చు.
మిథునం:
శ్రమానంతర ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఓర్పుతో వ్యవహరించండి.
కర్కాటకం:
ఆచితూచి అడుగేయండి. తొందరపాటు చర్యలు వద్దు. వ్యాపారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఘర్షణలకు తావు ఇవ్వవద్దు.
సింహం:
మీ ప్రతిభతో సమస్యలను పరిష్కరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది. వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. మాట అదుపులో ఉంచుకోండి. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు.
కన్య:
ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అంతా కలసివస్తుంది. రాబడి బాగుంటుంది. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో వ్యవహరించండి. శుభకార్య యత్నాలు చేస్తారు. కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
తుల:
అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. శుభసమాచారం అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టే యోచన చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. పనిపై దృష్టి పెట్టండి. అశ్రద్ధ వద్దు. ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి.
వృశ్చికం:
ఆర్థికంగా బాగుంటుంది. అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. నోరు అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. భాగస్వాములతో గొడవలొద్దు.
ధనుస్సు:
స్వగృహంకోసం ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరూ కలసివస్తారు. కొందరు మీ సహనాన్ని పరీక్షిస్తారు. సంయమనంతో వ్యవహరించండి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కళాకారులకు, రాజకీయనాయకులకు కలసివస్తుంది.
మకరం:
కొత్తప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు చర్యలు చేపట్టండి. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఈరోజు ఆనందంగా గడుపుతారు. అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది. తొందరపాటుగా వ్యవహరించవద్దు.
కుంభం:
ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. ఆర్థికపరిస్థితి బాగుంటుంది. వ్యాపారులకు కలసివస్తుంది. రాజకీయనాయకులు, కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మీకు గుర్తింపు లభిస్తుంది.
మీనం:
ఆర్థికంగా అంత బాగా ఉండదు. అనవసర ఖర్చులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సమస్యలు తలెత్తుతాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. ఘర్షణలకు దూరంగా ఉండండి. వివాదాల్లో తలదూర్చవద్దు. పనిపై శ్రద్ధ చూపండి.