భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు సెలవు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఉస్మానియా, జేఎన్టీయూ, కేయూ యూనివర్సిటీల పరిధిలోని అన్ని కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఏపీలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.