ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారుఈ సెలవు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్తిస్తుంది. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావం చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.