Homeహైదరాబాద్latest Newsఇవాళే బక్రీద్ పండుగ.. బక్రీద్ ఎలా మొదలైంది.. ఎందుకు జరుపుకుంటారు..?

ఇవాళే బక్రీద్ పండుగ.. బక్రీద్ ఎలా మొదలైంది.. ఎందుకు జరుపుకుంటారు..?

ముస్లింల ప్రధాన పండగలు రంజాన్‌, రెండోది బక్రీద్. ఈ పండుగకు ఈద్-ఉల్-జుహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఉన్న ముస్లింలు రెండవ అత్యంత పవిత్రమైన బక్రీద్‌ను ఇవాళ జరుపుకుంటున్నారు. ఈద్ అల్-అధాను ఆనందం, చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇస్లామ్ క్యాలెండర్ ప్రకారం 12వ నెల జిల్‌హేజ్‌ 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకుంటారు. ఇస్లామిక్ కమ్యూనిటీలో పండుగలు చంద్రుని దర్శనం తర్వాత జరుపుకుంటారు,

బక్రీద్ పండుగ.. చరిత్ర
ముస్లింల విశ్వాసం ప్రకారం, హజ్రత్ ఇబ్రహీం భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉన్న దేవుని సేవకుడు. ఒకసారి హజ్రత్ ఇబ్రహీం తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రియమైన ఏకైక కుమారుడిని త్యాగం చేయాలని కల కంటాడు. హజ్రత్ ఇబ్రహీం ఈ కలను దేవుని సందేశంగా భావించి తన 10 ఏళ్ల కుమారుడిని దేవుని మార్గంలో బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే కుమారుడిని బలి ఇచ్చే సమయానికి.. కుమారుడికి బదులు.. మేకను పెట్టి మేకను బలి ఇవ్వమని అల్లా సూచించాడని చెబుతారు.

బక్రీద్ పండగను ఎందుకు జరుపుకుంటారు..?
హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మసీదులో ఉన్న కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి అక్కడ ప్రార్థనలు చేస్తారు. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజ్ చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు. హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కా నుంచి మదీనాను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతాడు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలి
బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజా మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో ముస్లింలు వలసలు ఎక్కువగా వెళ్తారు. ముస్లీంలంతా తమ జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలనే నియమం ఉంది. అది కూడా కష్టపడి సంపాదించిన సొమ్ముతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా, రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నానే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

Recent

- Advertisment -spot_img