ఇవాళ హైదరబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్లను గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక ఈ చివరి మ్యాచ్లోనూ విజయం సాధించి, సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్లో సత్తాచాటారు.