ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 7న జరుపుకుంటారు. ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల కలిగే లాభ, నష్టాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం దీనిని జరుపుకుంటారు. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల సంక్రమించే వ్యాధులనుంచి రక్షణ పొందేందుకు ఈ రోజున అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తాయి. అంతేకాకుండా తినే ఆహారం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తాయి.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం చరిత్ర
ప్రతి సంవత్సరం ఆహార భద్రతా దినోత్సవాన్ని 20 డిసెంబర్ 2018న జరుపుకోవాలని UNO జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీనిని జరుపుకుంటున్నారు. ఆహార భద్రతపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. సురక్షితమైన, పౌష్టికాహారం ప్రాధాన్యతను ప్రజలకు ప్రభుత్వాలు వివరిస్తారు. ఇంతకుముందు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని మొదటిసారిగా 7 జూన్ 2019న జరుపుకున్నారు.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రాముఖ్యత
కల్తీ ఆహార పదార్థాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ఆపడమే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఉద్ధేశ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, వ్యవసాయం, పర్యాటకాలకు స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా WHO, UNO, FAO సంయుక్తంగా ఈ రోజును జరపడానికి ముందుకు వచ్చాయి. ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలనే లక్ష్యంతో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇప్పటికీ చాలా రకాల కార్యక్రమాలు చేపట్టింది.
ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు
ఆహార భద్రత అనేది సామాన్య ప్రజలందరి ప్రాథమిక హక్కు. సురక్షితం కాని ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయనాలు ఉంటాయి, ఇవి దాదాపు 200 వ్యాధులకు దారితీస్తాయి. ఇందులో డయేరియా నుండి క్యాన్సర్ వరకు అన్నీ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కలుషిత ఆహారం కారణంగా దాదాపు 4,20,000 మంది మరణాలు సంభవించాయి. ఇందులో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, ఆరోగ్యం సరిగా లేని వారు ఉన్నారు.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క లక్ష్యం
ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలలో అవగాహన కల్పించడమే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రధాన లక్ష్యం. దీనిద్వారా ప్రజలు తాము తినే ఆహారం పరిశుభ్రంగా మరియు సురక్షితంగా ఉందా, తినదగినదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రభుత్వాలు.. ప్రజలను పరిశుభ్రంగా తినడం అలవాటుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం. అలాగే, ఆహారం తయారీ సమయంలో శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార భద్రత, ఊహించని వారి కోసం ఆహారాన్ని సిద్ధం చేయడమే ఈ ఏడాది థీమ్.