Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (23-09-2024, సోమవారం)

నేటి రాశి ఫలాలు (23-09-2024, సోమవారం)

మేషం
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి విషయాల్లో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు. తండ్రి తరఫు వారితో సఖ్యత నెల‌కొంటుంది. అనుకున్న కార్యక్రమాల్లో పురోగతి క‌నిపిస్తుంది. వ్యాపారులు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. విధి నిర్వహణలో ఉద్యోగులు అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు. పరిశోధకులు, కళాకారులకు ఊహించని అవకాశాలు. పారిశ్రామికవేత్తలు కొత్త విభాగాలు ప్రారంభిస్తారు.

వృషభం
ఇంటా బయటా గౌరవ మర్యాదలు ల‌భిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుర‌వుతాయి. నిరుద్యోగులకు అనుకోని ఉద్యో గలాభం ఉంది. ఇంటి నిర్మాణ యత్నాల్లో పురోగతి. దీర్ఘకాలిక వివాదాల పరిష్కారం అవుతాయి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉత్సాహం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. క్రీడాకారులకు విశేషంగా కలసివస్తుంది. కళాకారులకు పట్టుదలతో అవకాశాలు.

మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. కొత్త కార్యాలు చేపడతారు. ఉద్యోగార్థులకు అనుకున్న ఉద్యోగాలు. అంచనాలు నిజమవుతాయి. కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. క్రీడాకారులు, కళాకారులకు అవకాశాలు వస్తాయి.

కర్కాటకం
ముఖ్య కార్యాలు విజయవంతం అవుతాయి. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాల్లో కుటుంబసభ్యుల సూచనలు పాటిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు తీరతాయి. శత్రువులు కూడా మీపట్ల ప్రేమ చూపుతారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. పారిశ్రామికవేత్తలు కొత్త సంస్థల ఏర్పాటుపై తుది ఒప్పందాలు. రాజకీయవేత్తలు అంచనాలు నిజం చేసుకుంటారు. పరిశోధకులు, కళాకారులకు సన్మానాలు ద‌క్కుతాయి.

సింహం
నూతన విషయాలు గ్రహిస్తారు. వ్యతిరేకులు అనుకూలంగా మారతారు. బంధువుల నుంచి ధనలబ్ది పొందుతారు. అందరిలోనూ విశేష గుర్తింపు. చేపట్టిన కార్యాల్లో పురోగతి ల‌భిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. జీవిత భాగస్వామితో సఖ్యత ల‌భిస్తుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు ఉండొచ్చు. పారిశ్రామికవర్గాలకు విజయాలు. క్రీడాకారులు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

కన్య
కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన రాబడి ల‌భిస్తుంది. ఒక సమాచారం నిరుద్యోగుల ను ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాలు ప్రారం భిస్తారు. శత్రువులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతం. క్రీడాకారులకు అవార్డులు రావచ్చు. రాజకీయవర్గాలకు నూతన పదవీయోగం. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు.

తుల
కొన్ని కార్యాలు. నిదానంగా సాగుతాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని రీతిలో పెట్టుబడులు, లాభాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. క్రీడాకారులు నైపుణ్యత చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలకు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. రాజకీయవేత్తలకు ఉత్సాహం, విదేశీ పర్యటనలు. పరిశోధకులు, కళాకారులకు కొత్త అవకాశాలు ద‌క్కుతాయి.

వృశ్చికం
నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. శత్రువులు స్నే హితులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు. ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలకు విదేశీ ఆహ్వానాలు. కొత్త సంస్థల ఏర్పాటులో విజయం. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

ధనుస్సు
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పట్టుదల, నేర్పుతో కొన్ని సమస్యల పరిష్కారం. అదనపు రాబడితో ఉత్సాహం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామికవేత్తలకు వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. కళాకా రులు, పరిశోధకులు సత్తా చాటుకుంటారు.

మకరం
ఆదాయ వ్యయాల మధ్య పొంతన ఉండదు.. ఒక సమాచారం నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. పెట్టుబడులు కొంత ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు పదవుల కోసం చేసే యత్నాలు మందగిస్తాయి. పారిశ్రామికవేత్తలకు నిదానం అవసరం. శుభవార్త వినే సూచ‌న‌లు ఉన్నాయి. వాహనసౌఖ్యం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం
దూరప్రయాణాలు. రాబడి కాస్త మెరుగ్గా ఉంటుంది. కోర్టు కేసులు ఇబ్బంది కలిగించినా ఉపశమనం లభిస్తుంది. సోదరీలను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. శుభకార్యాలకు విరివిగా డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఆశ్చర్యకరమైన రీతిలో ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు కొన్ని విజయాలు. రాజకీయవేత్తలకు పదవులు రాగలవు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి.

మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి కుటుంబసమస్యలు కొన్ని తీరతాయి. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. ఒక కీలక సమాచారం అందుకుంటారు. బంధు వర్గంతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మా ణయత్నాల్లో పురోగతి. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారులకు అనుకోని లాభాలు. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. క్రీడాకారులు, రాజకీయవేత్తల అనుభవాలు ప్రస్తుతం ఉపకరిస్తాయి. పరిశోధకులు, కళాకారులకు విదేశీ పర్యటనలు, సన్మానాలు.

Recent

- Advertisment -spot_img