తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, బీఆర్ఎస్ హయాంలో పండుగలా మారిందని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు రూ. 4.5 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.
ALSO READ : Revanth reddy : సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట.. నాడు ఏపీతో కలిసి.. నేడు ప్రపంచంతోనే..!!