Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (19-09-2024, గురువారం)

నేటి రాశి ఫలాలు (19-09-2024, గురువారం)

మేషం
గ్రహ సంచారాలు సహకరిస్తాయి. అయిన‌ప్ప‌టికీ శ్రద్ధ, ఆసక్తి చూప‌లేరు. ఖర్చులు నియంత్రించుకొంటూ ముందుకు సాగాలి. భారీ ఖర్చులు ఏర్పడు సూచనలు ఉన్నాయి. సమస్యను పరిష్కరించుకోవ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ భయం, ఆందోళన లతో వెనకడుగు వేసే సూచనలున్నాయి. ధైర్యం చేయండి. వృత్తి, ఉద్యోగ మార్పుల కోసం యత్నించుకొను వారికి శుభాలు ఏర్పడతాయి. అధికారులచే ప్రశంసలు పొందుతారు. అమ్మ‌వారి దేవాల‌యాన్ని సంద‌ర్శించండి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

వృషభం
సంతృప్తికరంగా రోజులు సాగుతాయి. కీల‌క విష‌యాలు ప్రయత్నించి ప్రయోజనాలు పొందుతారు. మాట, మంచితనం కొనసాగేట్లు జాగ్రత్త పడండి. నూతన పనులకు శ్రీకారం చుట్టగలరు. సంతాన అవసరాలు తీర్చు టకు యత్నించుకోగలరు. కుటుంబంలో చిన్నతరహా మార్పులు నిర్వహించగలరు. వాహన, ఎలక్ట్రానిక్ వస్తువుల ఏర్పాట్లు ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. మంచి జ‌రుగుతుంది.

మిథునం
మీ ఊహల్ని, ప్రయత్నాల్ని కార్యరూపంలో పెట్టగల‌రు. ఆర్థికంగా చిన్న తరహా సంతృప్తిని ఏర్పరచుకో గలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా బావుంటుంది. అవసరాలకు తగినట్లు ఆర్థిక సర్దుబాటులుంటాయి. మానసిక ఒత్తిడిని ఏర్పరచిన అంశాల్ని దూరం చేసుకోగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. ఇష్ట‌దేవ‌తారాధ‌న మంచి ఫ‌లితాలు అందిస్తుంది.

కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి గ్రహసంచారాలు బాగున్నాయి. నిత్యకృత్యములకు మార్పు చేర్పు లేర్పరచగలరు. సమయోచితంగా సాగి బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగించగలరు. ప్రభుత్వ తరహా పనుల్ని అనుకూలింప చేసుకో గలరు. సంతానంచే శుభవార్తలు వింటారు. ఉన్నత ఉద్యోగులకు బాధ్యతల మార్పు, స్థానచలనం ఉంటాయి. కీలకమనుకొన్న అంశాలపై పట్టు సాధిస్తారు.లలితా స‌హ‌స్ర నామ స్తోత్రాలు ప‌ఠించండి.

సింహం
గ్రహసంచారాలు మిశ్రమ ఫలితాలనిస్తాయి. ఆత్మనూన్యతా భావాలు వంటివి వెంట‌డ‌తాయి. చిన్నచిన్న విషయాలు చికాకు పరచగలవు. అపరిచితులతో మితంగానే సాగాలి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతగా వ్యవహ రించుకోవాలి.ఆర్థికంగా బాగుంటున్నా ఖర్చులు ఎక్కువ ఉండగలవు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు పెరుగు సూచనలున్నాయి. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోండి.

కన్య
బంధువర్గమున అంతఃకలహములను దూరం చేసుకోగలరు. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసుకొంటారు. నూతన కోర్సుల పట్ల ఆకర్షితులు అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల స్వీకారం ఉంటాయి. కుటుంబ వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడుతుంది. పెట్టుబడులు పెంచుకుంటారు. పోటీ పరీక్ష‌ల‌తో విజయాల‌ను పొందుతారు.

తుల‌
గ్ర‌హ‌ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. గత లోటు పాట్లను సవరించుకొనేందుకు య‌త్నిస్తారు. అవకాశాలు కలసి వస్తాయి. శ్రమలు ఎక్కువ ఉన్నా అనుకూలతలు పెంచుకోగలుగుతారు. కుటుంబంలో ముఖ్యమైన విషయం ఆలస్యంగా తెలుస్తుంది. లౌక్యం, మౌనంగా ఉండుటయే మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాలో వ్యవహారాలు పూర్తిచేసుకొని మెప్పును పొందుతారు. అమ్మ‌వారి ధ్యానం శుభ‌ప్ర‌దం.

వృశ్చికం
ఈరోజు మిశ్రమముగా ఉంటుంది. విమర్శలు చేయు వ్యక్తులు పెరుగుతారు. ఆర్థిక సర్దుబాట్లు వంటివి అవసరమయినా నెలవారి రుణములను తీర్చగలుగుతారు. సంతాన వ్యవహారాల్లో అనుకూలతలు పెంచుకోగలరు. వారి అవసరాలను తీర్చగలుగుతారు. కుటుంబ వ్యక్తులచే ఉత్సాహాలు పొందగలరు. అధికారులు ఒత్తిడులు ఉంటాయి. సంయమనాలు పాటించుకోండి. గ‌ణ‌ప‌తి నామాలు చ‌ద‌వండి.

ధనుస్సు
గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకోండి. అవకాశాలు కలసి వస్తాయి. కుటుంబంలో ఉత్సాహకరమైన స్థితులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో వృద్ధి, ప్రమోషన్ ఏర్పడు సూచనలు గలవు. గత సమస్యలకు పరిష్కారాలు ఏర్పరచుకోగలరు. నూతన ఒప్పందాలు, అగ్రిమెంట్లు చేసుకోగలరు. సంతానపు అవసరాలు తీర్చుటకు ఒత్తిడిని ఎదుర్కో వలసి రావచ్చును.

మకరం
గ్రహసంచారాలలో మార్పులు చిన్నతరహా ప్రయోజనాలనిస్తాయి. వివాదకరమైన అంశాలు కొన్ని చికాకునకు గురిచేస్తాయి. సంతాన పరంగా మీరు తీసుకొను నిర్ణయాలు పునర్విమర్శలకు గురిచేయు సూచనలు కలవు. జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వృత్తి, ఉద్యోగ అదనపు బాధ్యతలతో అధికార్లతో చిన్నతరహా మానసిక ఘర్షణలు, ఇతరులపట్ల దురుసుగా వ్యవహరిస్తారు. జాగ్ర‌త్త‌గా ఉండండి.

కుంభం
కొన్నింట మంచి ఫలితాలు, కొన్నింట‌ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఖర్చులెక్కువ అయినా అమలు చేసుకోగలుగుతారు. ప్రభుత్వతరహా పనుల్ని పూర్తి చేసుకొంటారు. విదేశీయతకు యత్నించుకొను వారికి శుభములు ఉంటాయి. ఇంటి విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చును.

మీనం
నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారి ప్రయ్నతకార్య అనుకూలతలు పెంచుకోగలరు. బాధ్యతాయుతం గాను, పట్టుదలతోను సాగి అనుకూలతలు పెంచుకోగలరు. వాహన ఏర్పాట్లు చేసుకోగలరు. అనారోగ్య భావనలు దూరం కాగ‌ల‌వు. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు అనుకూలింప చేసుకొంటారు. చెల్లింపుల్ని పూర్తి చేసుకొనునట్లు ఆదాయాలుంటాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు వంటివి ఉంటాయి. ఏదైనా దేవాల‌యాన్ని సంద‌ర్శించండి. మంచి జ‌రుగుతుంది.

Recent

- Advertisment -spot_img