Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (04-09-2024, బుధవారం)

నేటి రాశి ఫలాలు (04-09-2024, బుధవారం)

మేషం
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అనునయంగా మెలగండి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. అపరిచితులతో మితంగా సంభాషించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనండి. మంచి జ‌రుగుతుంది.

వృషభం
రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసు కుంటారు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అమ్మవారికి కుంకుమార్చ‌న చేయండి.

మిథునం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పిల్లల విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. దేవాల‌యాలు సంప్ర‌దించండి.

కర్కాటకం
నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కీల‌క‌ పనులు, బాధ్యతలు ఇత‌రుల‌కు అప్పగించవద్దు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వేడుకల‌ను ఘనంగా చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి అభిషేకం చేయండి.

సింహం
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధిక మవుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఇత‌రుల‌తో అప్రమత్తంగా ఉండాలి. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఇష్ట‌దేవ‌తా ఆరాధ‌న మంచిది.

కన్య
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగి స్తాయి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆధ్యాత్మికతపై దృష్టి పెడతారు. లక్ష్మీదేవిని ఆరాధించండి. మంచి జ‌రుగుతుంది.

తుల
ప్రతికూలతలు అధికం. కార్య సాధనకు మరింత శ్రమించాలి. సమర్థతకు గుర్తింపు ఉండదు. అందరితోను మితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శుభకార్యానికి హాజరవుతారు.

వృశ్చికం
సర్వత్రా యోగదాయకమే. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. అప్రియమైన వార్త వినాల్సి వస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి జ‌రుగుతుంది.

ధనుస్సు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. సోదరులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సామరస్యంగా మెలగండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది.

మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వాళ్ళు లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్థతకు గుర్తింపు ఉండదు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. కీలక వ్యవహారంతో తీరిక ఉండదు. పట్టుదలకు పోయి అవకాశాలను చేజార్చుకుంటారు. ఆత్మీయుల సలహా పాటించండి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. శివాల‌యాన్ని సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేయండి.

కుంభం
అనుకూలదాయకమైన స‌మ‌యం. ఆందోళన కలిగించినా సద్దుమణుగుతుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సలహాలు, సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు ముందుకు సాగవు. నోటీసులు అందుకుంటారు. న‌వ‌గ్ర‌హ శ్లోకాలు చ‌ద‌వండి మంచి జ‌రుగుతుంది.

మీనం
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

Recent

- Advertisment -spot_img