Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (14-07-2024, ఆదివారం)

నేటి రాశి ఫలాలు (14-07-2024, ఆదివారం)

మేష రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక‌ప‌రంగా సంతృప్తినిస్తుంది. సన్నిహితులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చే ఫలితాలు ఉన్నాయి. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జ‌రుపుతారు. ఆత్మీయుల‌తో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు ల‌భిస్తాయి.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులతో వివాదాల పరిష్కారమ‌వుతున్నాయి. శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు స‌రైన స‌మ‌యం. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డుతుంది. ముఖ్య కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. భూములు, వాహనాల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

మిథున రాశి
ఈ రాశి వాళ్ళు ఈరోజు ముఖ్యమైన కార్య‌క్ర‌మాల‌ను శ్ర‌మతో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల‌ను నేర్పుతో పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వా నాలు అందుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ప్రముఖులు పంపిన సందేశంతో ఊరట పొందుతారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు సొంతం అవుతాయి. ఉద్యోగులకు ఉన్నత ప‌ద‌వులు సూచితం.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఆశించిన ఆదాయం సమకూరుతుంది. కొత్త కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడతారు. వివాహాది వేడుకల నిర్వహణలో పాలు పంచుకుంటారు. జ్ఞాప‌కాలు నెమ‌రువేసుకుంటారు. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్ప‌డుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వ‌స్తాయి.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పొందుతారు. కొన్ని సమస్యలు నేర్పుతో పరిష్కారిస్తారు. వాహ‌నాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మా ణాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప‌దోన్న‌తి సూచితం.

కన్యా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని విధంగా రాబడి ఉంటుంది. అప్పులు తీరి ఊరట పొందుతారు. కొన్ని కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశయాలు నెరవేరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటారు. మీ నిర్ణయాల‌ను అందరూ ప్రశంసిస్తారు. ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారులకు లాభాలు సూచితం. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి.

తులా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన ప‌నుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలతో ఇబ్బందిపడతారు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు లోటు ఉండదు. వ్యాపారులకు లాభాలు దక్కినా చికాకులు తప్పకపోవచ్చు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు దొరికే అవ‌కాశం ఉంది. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు. వాహన, కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈ రోజు రావలసిన డ‌బ్బు స‌మ‌యానికి అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరే అవ‌కాశం ఉంది. చేపట్టిన కార్యాలు విజయవంతమ‌వుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు ల‌భిస్తుంది.

మకర రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈరోజు అదనపు రాబడి సూచితం. సన్నిహితులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగాలు ల‌భిస్తాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవేత్తలకు ఆదరణ పెరుగుతుంది.

కుంభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు నూత‌న కార్య‌క్ర‌మాల్లో సకాలంలో పూర్తి చేస్తారు. తగిన గుర్తింపు ల‌భిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తుది పరిష్కారం ల‌భిస్తుంది. ఇంటి నిర్మాణాలు మొదలుపెడతారు. పెట్టుబడులు సమకూరి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురవుతున్న చిక్కులు తొలగుతాయి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు ఎంతోకాలంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆశయాలు నెరవేరతాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహన యోగం ఉంది. కీల‌క విష‌యాల ప‌ట్ల అనుకూల నిర్ణ‌యాలు తీసుకుంటారు. శత్రువులు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు ద‌క్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం ల‌భిస్తుంది.

Recent

- Advertisment -spot_img