Homeఫ్లాష్ ఫ్లాష్నేటి రాశి ఫలాలు (16-06-2024)

నేటి రాశి ఫలాలు (16-06-2024)

మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడులుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ మరింత అధికమవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడులుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. కళాకారులకు సన్మానాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కొన్ని ముఖ్య వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. మీ నిర్ణయాలలో మార్పులుంటాయి. వృత్తి వ్యాపారపరంగా సామాన్య ఫలితాలుంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి. అధ్యాత్మిక చింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలుంటాయి. అరుదైన సన్మానాలు అందుకుంటారు. వాహనయోగమున్నది. వృత్తి వ్యాపారపరంగా అనుకూలం. శుభకార్యానికి హాజరవుతారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలుంటాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి
కర్కాటకఈ ప్రతిఫలముండదు. వ్యాపార, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులుంటాయి. బంధువులతో అకారణంగా గొడవలేర్పడతాయి. ఆస్తి విషయాలలో ఆటంకాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణలుంటాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్యనారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పఠించండి.

సింహ రాశి
ఈ సింహ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన వ్యక్తుల పరిచయాలేర్పడతాయి. విద్య, ఉద్యోగావకాశాలు కలసివస్తాయి. ప్రముఖులతో పరిచయాలుంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు విదేశీయాన యోగమున్నది. సింహ రాశి వారికి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. సూర్యాష్టకాన్ని పరించడం మంచిది.

కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ధన వ్యయముండును. అనారోగ్య సమస్యలుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. దూర ప్రయాణాలుంటాయి. విద్యార్థులకు పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రావు. కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుడిని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి
తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలుంటాయి. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తులా రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. నూతన విద్యావకాశాలుంటాయి. కుటుంబంలో శుభకార్యాలుంటాయి. ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా అనుకూల సమయం. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో వివాదాలేర్పడతాయి. అనుకోని ధనవ్యయముంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటాబయటా లేనిపోని సమస్యలుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృతి వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు. గృహ మరమ్మత్తులు చేపడతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. కొత్త రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అంత అనుకూలంగా లేదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులుంటాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలం ఆహార నియమాలు పాటించాలి. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కొత్త పరిచయాలేర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి సమయం. కొత్త విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు ఆనందాన్నిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకమైన విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి రోజు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Recent

- Advertisment -spot_img