Homeహైదరాబాద్latest Newsనేటి రాశి ఫలాలు (17-11-2024, ఆదివారం)

నేటి రాశి ఫలాలు (17-11-2024, ఆదివారం)

మేషం:

ఈ రాశి వారికీ సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనవ్యయం.

వృషభం:

ఈ రాశి వారికీ బుద్ధికుశలతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఇల్లు, వాహనం కొనే ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణపై దృష్టి పెడతారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిస్థితులు కలసివస్తాయి.

మిథునం:

ఈ రాశి వారికీ రావలసిన సొమ్ము దక్కుతుంది. చిరకాల సమస్యలు తీరతాయి. ఆప్తుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు తీర్చే ప్రయత్నం చేస్తారు. వాహనయోగం ఉంది. ఖర్చు పెరుగుతుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. కళారంగంలోనివారికి ఆహ్వానాలు అందుతాయి.

కర్కాటకం:

ఈ రాశి వారికీ వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలోచన చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. సమస్యలు తీరతాయి. మంచి సమాచారం అందుకుంటారు. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అవసరాలు తీరతాయి.

సింహం:

ఈ రాశి వారికీ ఆకస్మిక ధనలాభం. ఊహించని విధంగా అన్నీ కలసివస్తాయి. రాజకీయాల్లోనివారికి, కళారంగంలోనివారికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణ యోచన చేస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య:

ఈ రాశి వారికీ సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. చికాకులు తొలగుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. మాటను అదుపు చేసుకోవాలి. అనారోగ్య సూచన.

తుల:

ఈ రాశి వారికీ అంతా అనుకూలంగా ఉంటుంది. సమస్యలు తీరతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. వాహన, గృహ కొనుగోలు విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆలోచనలు కలసివస్తాయి. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం:

ఈ రాశి వారికీ వివాదాలు పరిష్కారమవుతాయి. సొమ్ము చేతికి అందుతుంది. భూములు, వాహనాలు కొనే ప్రయత్నాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ ఆలోచన చేస్తారు. శుభకార్యయత్నాలు చేపడతారు. కళాకారులు, క్రీడాకారులకు అనుకూలమైన రోజు.

ధనుస్సు:

ఈ రాశి వారికీ మీ ప్రతిభను అందరూ గుర్తిస్తారు. అనుకోని విధంగా రాబడి సమకూరుతుంది. బంధుమిత్రుల నుంచి సాయం అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు, రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలకు కలసివస్తుంది. క్రీడాకారులు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.

మకరం:

ఈ రాశి వారికీ పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. సోమరితనం వీడాలి. పనిపై దృష్టి పెట్టాలి. అనారోగ్య సూచన. ఒత్తిళ్ళు పెరుగుతాయి. అనవసర వివాదాలు తలెత్తుతాయి. మాటపట్టింపులు పెరుగుతాయి. ఓరిమి వహించాలి. మాట అదుపులో ఉంచుకోవాలి.

కుంభం:

ఈ రాశి వారికీ పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు చేస్తారు. చేతికి సొమ్ము అందినట్టే అంది దూరమవుతుంది. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంట్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు కొనే ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అనుకోని విధంగా మద్దతు లభిస్తుంది.

మీనం:

ఈ రాశి వారికీ బాల్యమిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు కలుగుతాయి. ధనవ్యయం అవుతుంది. ఆస్తులు కొనే ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు

Recent

- Advertisment -spot_img