Homeఫ్లాష్ ఫ్లాష్నేటి రాశి ఫలాలు (26-05-2024)

నేటి రాశి ఫలాలు (26-05-2024)

మేష రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. లక్ష్యసాధనతో అనుకున్నది సాధిస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడిపెదరు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. మేషరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించండి. సూర్య నమస్కారం వంటివి చేయటం వలన శుభఫలితాలు కలుగుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. భవిష్యత్‌ ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. స్థాన చలన సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు శాంతంగా వ్యవహరించాలి. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. వృషభరాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించండి. నవగ్రహ జపం చేయటం మంచిది.

మిథున రాశి
ఈ రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి. మీమీ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు లాభదాయకం. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ గృహ యోగాలున్నాయి. స్థిరమైన ఆలోచనా విధానంతో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయ సహకారాలుంటాయి. ముఖ్యమైన విషయాల్లో మొహమాటం పనికిరాదు. ధనలాభం ఉన్నది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం అరుణం పారాయణం చేయడం మంచిది. సూర్యభగవానుడికి తర్పణాలు వదలండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగులకు పదోన్నతులు. అనుకూల స్థాన చలన మార్చు. కోర్టు కేసుల్లో తాత్కాలిక ఊరట లభిస్తుంది. ప్రయాణాల ద్వారా పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు అలస్యంగా చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో ఆర్థిక లోటు ఉండొచ్చు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది ప్రయత్నాలు సఫలమవుతాయి. కర్కాటకరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సూర్య నారాయణమూర్తిని పూజించండి. చంద్రశేఖరాష్టకం పరించండి.

సింహ రాశి
ఈ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ప్రారంభించిన కార్యక్రమాలలో ఉత్సాహంగా పనిచేసి విజయం పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. తోటివారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీమీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారవుతారు. అజాగ్రత్త వద్దు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. సూర్యాష్టకాన్ని పఠించడం మంచిది.

కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. సిరి సంపదలు పెరుగుతాయి. మీమీ రంగాల్లో గొప్ప శుభఫలితాలను అందుకుంటారు. పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల నుంచి ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యభగవానుడిని పూజించి బెల్లం, పరమాన్నాన్ని నివేదించడం మంచిది. ఆలయాలను దర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

తులా రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. మిత్రులతో కలసి ఆనందముగా గడుపుతారు. బాగా ఆలోచించి పనులను చేయాలి. మీ సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ప్రారంభించిన పనుల్లో ధైర్యంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. మీ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తులా రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మంచిది. సూర్య నమస్కారాలు చేయాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మానసిక అనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం ఆదిత్య హృదయాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటివి చేయాలి.

ధనూ రాశి
ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్య విషయాల్లో సందర్బోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో కొన్ని సమస్యలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. ధనూ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం సూర్యాష్టకాన్ని పఠించాలి. నవధాన్యాలను దానం ఇవ్వడం మంచిది.

మకర రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపెదరు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. అరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేసి తోటివారి నుంచి ప్రశంసలను అందుకుంటారు. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. ఈ రోజు నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది. సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభ రాశి
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడుపుతారు. మృష్టాన్న భోజన ప్రాప్తి. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ఒక వార్త బాధ కలిగిస్తుంది. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ప్రశాంతతతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి. కోపాన్ని దరిచేరనీయకండి. కుంభ రాశి మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి.

మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మనోబలంతో విజయాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహా వల్ల మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఒక శుభవార్త అనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. సహనంతో ఉండాలి. గృహ వాహన యోగాలున్నాయి. దగ్గరివారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ స్తోత్రం పారాయణ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

Recent

- Advertisment -spot_img