మేష రాశి
ఈ రాశి వారికి కలిసి వచ్చేకాలం. శుభయోగం ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్ధికంగా స్థిరపడతారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమతో విజయం సాధిస్తారు. మానసిక దృఢత్వం అవసరం. వ్యాపారం పట్ల మరింత శ్రద్ధ చూపాలి. మాట అదుపులో ఉంచుకోండి. లక్ష్మీదేవి ధ్యానం శుభప్రదం.
వృషభ రాశి
ఈ రాశి వారి ఆశయాలు నెరవేరుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. లక్ష్య సాధనలో ఇతరుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలను పొందుతారు. కీలక నిర్ణయాల్లో ఏకాగ్రత అవసరం. కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం మంచిది. ఇష్టదైవాన్ని స్మరించండి. మంచి ఫలితాలు పొందవచ్చు.
మిథున రాశి
ఈ రాశి వారికి మనోబలం అవసరం. దీర్ఘకాలిక కల నెరవేరుతుంది. కీలక విషయాల్లో శుభయోగం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అడుగేయండి. సహనం, ఓర్పు, నేర్పు చాలా అవసరం. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా ఒత్తిడికి గురికావద్దు. ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. అంతిమ విజయం మీదే. సూర్యనారాయణుడిని ఆరాధించండి.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలున్నాయి. బుధుడు రెండో స్థానంలో ఉండటంతో అనూహ్యమైన ధనలాభాన్ని పొందుతారు. కొంతకాలం నుంచీ వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. జన్మ శుక్రయోగం వల్ల మంచి పరిణామాలు సంభవిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు తొలగుతాయి. కులదైవాన్ని ప్రార్ధించండి. మంచి జరుగుతుంది.
సింహ రాశి
ఈ రాశి వారికి గత అనుభవాలను మరిచిపోవద్దు. కీలక విషయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్య వ్యవహారాలను కొంతకాలం వాయిదా వేయడం ఉత్తమం. గ్రహాల స్థితిగతులు కొంతమేర వ్యతిరేకంగా ఉన్నాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనలను విస్మరించకూడదు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కన్యా రాశి
ఈ రాశి వారికి శుభప్రదమైన సమయం. కీలక విషయాల్లో లక్ష్యం సిద్ధిస్తుంది. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఇతరుల ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. బుద్ధిబలంతో వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. ప్రశాంతత లభిస్తుంది.
తులా రాశి
ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. మనోబలంతో నిర్ణయాలు అమలు చేయండి. ఉద్యోగులకు అన్నివిధాలా కలిసొస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నైపుణ్యాన్నిపెంచుకుంటారు. వ్యాపారయోగం ఉంది. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇలవేల్పును పూజించండి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ధనలాభం సూచితం. మనోబలం అవసరం. చిరకాల కోరికలు తీరుతాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. స్వల్ప ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహం పడవద్దు. నిర్ణయాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వండి. కొందరి అసూయాద్వేషాలు ఇబ్బంది పెడతాయి. ప్రశాంతత అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. మీ ధైర్యం, ఉత్సాహం నలుగురి మన్ననలూ అందుకుంటాయి. కొన్నిసార్లు సాహసోపేతంగా వ్యవహరించక తప్పదు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మొహమాటాన్ని అధిగమించాలి. లక్ష్మీదేవిని పూజించడం అవసరం.
మకర రాశి
ఈ రాశి వారికి ఓ గెలుపు మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. సకాలంలో పనులు ప్రారంభించండి. మాటలు పొదుపుగా వాడటం అవసరం. మీ మాటల వల్ల అపార్థాలకు ఆస్కారం ఉంది. ఏ విషయంలోనూ నిరుత్సాహం వద్దు. మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. బుద్ధిబలంతో వ్యాపార అవరోధాలను అధిగమిస్తారు. నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారి ఉద్యోగ ఫలితాలు కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. లక్ష్యాలను చేరుకోడానికి అనువైన సమయం. అన్నివిధాలా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్య నిర్ణయాల విషయంలో వెనుకాడవద్దు. ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులకు అనుగుణంగా స్పందించండి. వ్యాపార విజయానికి ఏకాగ్రత అవసరం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
మీన రాశి
ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. పెద్దల ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా బలపడతారు. వృథా వ్యయాలను తగ్గిస్తే మేలు. గతంలో కోల్పోయినవి తిరిగి పొందుతారు. ఆత్మవిశ్వాసంతో సమస్యల నుంచి బయటపడతారు. సూర్యనారాయణమూర్తిని స్మరించండి.