Homeఫ్లాష్ ఫ్లాష్Tollywood: రాఘవేంద్ర రావు కొత్త సినిమాలో తానే హీరోన‌ట‌.. ముగ్గురు హీరోయిన్ల‌ట‌

Tollywood: రాఘవేంద్ర రావు కొత్త సినిమాలో తానే హీరోన‌ట‌.. ముగ్గురు హీరోయిన్ల‌ట‌

హైద‌రాబాద్ః డైరెక్ట‌ర్ రాఘవేంద్ర రావు హీరోగా కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాఘవేంద్ర రావు హీరోగానా అని టాలీవుడ్లో ఈయన గురించే చర్చించుకుంటున్నారు. 78 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న చేసే ప్ర‌యోగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

1975 సంవత్సరం ‘బాబు’ సినిమాతో మెగా ఫోన్ పట్టి కెరీర్ ప్రారంభించిన ఆయన ఇంతవరకూ కెమెరా ముందుకు రాలేదు.

ఇటీవల ఓ ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఫిదా అయిన దర్శకేంద్రుడు ఏకంగా ఆ కథతో తానే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారట.

పైగా కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి ఉన్నార‌ట‌. ఇందుకోసం రమ్యకృష్ణ, శ్రీయ, త్రిషలతో ఇప్పటికే సంప్రదింపుల కార్యక్రమాలు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది.

ఇందులో వాస్త‌వం ఉందో లేదో తెలియాలంటే డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు అఫిషియ‌ల్‌గా స్పందించే వ‌ర‌కు ఆగాల్సిందే.

Recent

- Advertisment -spot_img