Homeహైదరాబాద్latest NewsTollywood : పాన్ ఇండియా రేసులో Balayya Babu

Tollywood : పాన్ ఇండియా రేసులో Balayya Babu

నందమూరి నటసింహం బాలకృష్ణ కేఎస్​ బాబీ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ఇటీవల దసరా సందర్భంగా విడుదలై భగవంత్​ కేసరితో మంచి హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఎన్ బీకే 109 షూటింగ్​ లో బాలయ్య బిజిగా ఉన్నాడు. సితార ఎంటర్​ టెయిన్​ మెంట్స్​, ఫార్చ్యూన్​ ఫోర్​ మూవీస్​ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ శరవేగంగా సాగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా ఎన్ బీకే 109 గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. బాలయ్య మార్క్ డైలాగ్ తో యాక్షన్ గ్లింప్స్ ఫ్యాన్స్ ని అలరించింది. ఇక గ్లింప్స్​లో ‘సింహం నక్కల మీదకు వస్తే అది వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ అంటూ సాగే బాలయ్య పవర్​ ఫుల్​ డైలాగ్​ తో ఫ్యాన్స్​ కు పూనకాలు వస్తున్నాయి. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడని ఫ్యాన్స్​ చెప్పుకుంటున్నారు. ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ తో పాటుగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల కూడా నటిస్తోంది. సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ తో పాటుగా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుందని టాక్. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలయ్య 109 చిత్రం పాన్-ఇండియా సినిమాగా తెరకెక్కుతోందని ఊర్వశి పోస్ట్ చేసింది. ఈ విషయంపై నిర్మాతల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు కానీ ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ టైం లో మై నెక్స్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ అంటూ ఊర్వశి రౌతెలా సోషల్ మీడియాలో మెసేజ్ చేసింది. మేకర్స్​ నుంచి మాత్రం ఎటువంటి అప్​ డేట్స్​ లేవు. మరి ఈ మూవీ నిజంగానే నేషనల్​ వైడ్​ గా విడుదలవుతుందా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img