Tollywood Directors : గతంలో మన తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ (Tollywood Directors) ఏడాదికి రెండు నుండి మూడు సినిమాలు తీసేవారు. అవి కూడా మంచి క్వాలిటీతో సినిమాలు రిలీజ్ చేసెవారు. ఈ క్రమంలో రాను రాను ఆ రోజులు పోతున్నాయి. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కేవలం రెండు నుండి నాలుగు ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళు తీసే సినిమాలు గొప్పవి అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అవి కమర్షియల్ సినిమాలు కాబట్టి.. మరి ఎందుకు ఇలా మన డైరెక్టర్స్ లేటు చేస్తున్నారో వారికే తెలియాలి.
దర్శక ధీరుడు రాజమౌళి అయితే అతను సినిమా కధలు చాలా పెద్ద స్పాన్ తో ఉంటాయి కాబట్టి అతను తీసే సినిమాలో విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే రాజమౌళి తీసే సినిమాలు కొంత లేట్ అవుతాయి. కానీ మిగతా డైరెక్టర్స్ ఆలా కాదు.. వారు తీసే సినిమాలు కమర్షియల్ కాబట్టి చాలా తక్కువ సమయంలోనే సినిమాలు తీసి రిలీజ్ చేయవచ్చు. అయితే ఈ కోవలోకి డైరెక్టర్ త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, సురేందర్ రెడ్డి ఇలా కొంతమంది చాలా లేటుగా సినిమాలు తీస్తున్నారు. సుకుమార్ తీసిన ”పుష్ప” సినిమా భారీ హిట్టుగా నిలిచింది. కానీ ఆ సినిమా తీయడానికి రెండు నుండి మూడు ఏళ్ళు సమయం తీసుకున్నాడు. కానీ ఆ సినిమా చూసాక ఎందుకు అంత సమయం పట్టింది అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఎక్కువగా టాకీ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇలానే చాలా మంది దర్శకులు తమ సినిమా అంత లేటుగా తిస్తె అంత డిమాండ్ ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సినిమాకే 4 నుండి 5 ఏళ్ల సమయాన్ని ఇస్తున్నారు. అలాగే తమ దగ్గర సరైన బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోవడంతో డైరెక్ట్ షూటింగ్ కి వెళ్లి.. ఎక్కువ సీన్స్ తీసి టైం వేస్ట్ చేస్తున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా పేరుతో సినిమాలను ఇంకా లేటు చేస్తున్నారు. దింతో ఏడాదికి ఒకసారి రావాల్సిన స్టార్ హీరోల సినిమాలు రెండు నుండి 4 ఏళ్ళకు ఒకసారి వస్తున్నాయి. ఇకనైనా కధ మీద దృష్టి పెట్టి సినిమాలను తక్కువ సమయంలో మంచి క్వాలిటీతో తీసే ప్రయత్నం చేయాలి.