టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఇటీవల ఆడియెన్స్ ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ మరో ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ‘ఈగల్’సినిమాపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. సోమవారం ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతుందని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి ఫుల్ మాస్‌గా కనిపించాడు.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా మధుబాల, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈగల్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీకి దావ్‌జాంద్ సంగీత దర్శకుడు.