టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి పీటలు ఎక్కింది. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హల్ లో మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణుని వివాహం చేసుకున్నారు. సాయి విష్ణు తండ్రి ఓ పొలిటీషియన్ కావడంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కాగా, మేఘా ఆకాష్.. లై, చల్ మోహన్ రంగా, రాజ రాజ చోర, పేట, కుట్టీ స్టోరీ డియర్ మేఘ వంటి చిత్రాల్లో నటించారు.