Homeహైదరాబాద్latest NewsTollywood : కన్నప్పలో నటసింహం బాలకృష్ణ..

Tollywood : కన్నప్పలో నటసింహం బాలకృష్ణ..

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు పరమ శివుని భక్తుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ ఉండనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారట. ప్రభాస్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండనున్నాయట. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కూడుతున్నాయి. కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్రలో నటసింహ బాలకృష్ణ కూడా నటిస్తున్నారట. మోహన్ బాబు ఫ్యామిలీకి, బాలకృష్ణ ఫ్యామిలీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ఊకొడతారా.. ఉలిక్కిపడతారా.. సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు కన్నప్ప కోసం బాలయ్య రెడీ అవుతున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Recent

- Advertisment -spot_img