కమెడియన్ సత్యం రాజేశ్ హీరోగా, దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. రెండేండ్ల కిందట వచ్చిన పోలిమేర సినిమా డైరెక్ట్‌గా హాట్ స్టార్‌లో రిలీజై ఓటీటీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో పార్ట్ 2పై మరింత హైప్ వచ్చింది. మేకర్స్ పోలిమేర 2ను ఈసారి థియేటర్లలో రిలీజ్ చేశారు. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సాలిడ్ వసూళ్లతో ఈ మూవీ దూసుకెళ్తోంది. మొదటి రోజు కంటే రెండో రోజు మాస్ బుకింగ్స్ నమోదయ్యాయి. వసూళ్లు కూడా అదే రీతిలో ఉన్నాయి. రెండ్రోజుల్లో ఈ సినిమా రూ. 6.6 కోట్ల గ్రాస్‌ను అందుకొని భారీ హిట్ దిశగా దూసుకెళ్తోంది. డిఫరెంట్ అటెంప్ట్‌తో వచ్చిన పోలిమేర 2 బాక్సాఫీసు వద్ద మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది