HomeసినిమాTollywood : మరోసారి రిపీట్ కానున్న రానా, తేజ క్రేజీ కాంబో..

Tollywood : మరోసారి రిపీట్ కానున్న రానా, తేజ క్రేజీ కాంబో..

టాలీవుడ్​లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో రానా ఒకరు. రోటీన్ ఫార్మాట్​లో కాకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్​ సినిమాలతో అలరిస్తున్నాడు రానా. ప్రస్తుతం భారీ సినిమాలు చేస్తున్న రానా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్​ను అనౌన్స్ చేశాడు. ప్రముఖ డైరెక్టర్​ తేజతో రానా మరో సినిమా చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. వీరి కాంబో నుంచి రెండో సినిమా కోసం చాలామంది ఆశించారు. ఫైనల్​గా దీనిపై గురువారం సాలిడ్ అప్​డేట్ వచ్చేసింది. తేజ డైరెక్షన్​ రానా సినిమాను కన్ఫార్మ్ చేస్తూ ‘రాక్షస రాజా’ అనే టైటిల్​ను అనౌన్స్​ చేశారు. రానా బర్త్ డే కానుకగా ఫస్ట్​ లుక్​ను సైతం రిలీజ్ చేయగా.. అది వైరల్​గా మారింది. నామాలు పెట్టుకొని, మెషీన్​గన్ చేతిలో పట్టుకుని రానా అగ్రెసివ్​గా కనిపిస్తున్నాడు. మరి ఈ సినిమా ఓ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img