HomeసినిమాTollywood : ఆ ఇద్దరు స్టార్స్​ సినిమాలపై తమన్ Interesting Post..!

Tollywood : ఆ ఇద్దరు స్టార్స్​ సినిమాలపై తమన్ Interesting Post..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్​గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే విధంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ రెండు భారీ సినిమాలకు మ్యూజిక్​ను తమన్ అందిస్తున్నాడు. అయితే, ఈ నెలలోనే గుంటూరు కారం, గేమ్ చేంజర్ సినిమాల నుంచి ఫస్ట్ సింగిల్స్​ రిలీజ్​ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో దీనిపై తమన్ ట్విట్టర్​లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘నవంబర్ వచ్చేసింది అని చెబుతూ.. గుంటూరు కారం, గేమ్ చేంజర్ ట్యాగ్​లను యాడ్ చేసి ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారుతోంది. రెండు సినిమాల ఫస్ట్​ సింగిల్స్​ ఏ రేంజ్​లో ఉండబోతున్నాయో తమన్ ఇలా ఎమోజీలను పోస్ట్ చేసి చెప్పాడంటూ మహేశ్​, రాంచరణ్​ ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు.

Recent

- Advertisment -spot_img