Tollywood : తెలుగు సినిమాల్లో హీరోలు, హీరోయిన్ల మధ్య వయస్సు తేడా ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న విషయం.. సాధారణంగా 40-50 ఏళ్ల వయస్సులో ఉన్నాహీరోలు 20-30 ఏళ్లలోపు ఉండే హీరోయిన్లు తో సినిమాలు చేస్తున్నారు. ఉదాహరణకు సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు తరం నుండి నేటి తరం హీరోలు వరుకు కొనసాగుతుంది. నాగేశ్వరరావు తన కెరీర్ ప్రారంభంలో జమున, సావిత్రి లాంటి నటీమణులతో నటించారు. తన 50 ఏళ్ల వయస్సులో నాగేశ్వరరావు శ్రీదేవి, జయప్రద లాంటి యువ నటీమణులు నటించారు. “ప్రేమాభిషేకం” సినిమాలో శ్రీదేవితో కలిసి నాగేశ్వరరావు నటించారు. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 58 ఏళ్లు, శ్రీదేవికి 18 ఏళ్లు.. అంటే 40 ఏళ్ల వయస్సు తేడా ఉంది.
నందమూరి తారక రామారావు తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించారు. 1979లో విడుదలైన “వేటగాడు” సినిమాలో ఎన్టీఆర్ 56 ఏళ్ల వయస్సులో శ్రీదేవితో జోడీ కట్టారు. శ్రీదేవికి అప్పుడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అంటే వీరి మధ్య 40 ఏళ్ల వయస్సు తేడా ఉంది. ఈ సినిమా ఆ దశకంలో రెండో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1972లో “బడి పంతులు” సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవికి తాత పాత్రలో నటించారు, మరియు కేవలం ఏడు సంవత్సరాల తర్వాత వీరు రొమాంటిక్ జంటగా నటించారు. ఇది ఆ రోజుల్లో చాలా సినిమాల్లో కనిపించే ఒక ట్రెండ్, మరియు ప్రేక్షకులు కూడా దీన్ని సహజంగా స్వీకరించారు.
అయితే ఇలా నటించడానికి ఆ కాలంలో ఒక ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే ఆ కాలంలో హీరోయిన్లు కొరత ఎక్కువగా ఉండేది. చాలా మంది 90వ దశకంలో హీరోయిన్ వేశాలు వేయడానికి ఇష్టపడేవారు కాదు. ఈ క్రమంలో ఉన్న కొంత మంది హీరోయిన్స్ తోనే సీనియర్ హీరోలు నటించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది.. చాలా మంది అమ్మాయలు హీరోయిన్లు అవ్వడానికి సినీ ఇండస్ట్రీకి వస్తున్నారు. ఈ క్రమంలో హీరోలు తమ వయస్సు ను దృష్టిలో పెట్టుకుని తమకు సరిపోయే హీరోయిన్స్ తో నటిస్తే బాగుటుంది.
ఇటీవలే చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో కాజల్ అగర్వాల్, తమన్నా లాంటి యంగ్ హీరోయిన్లు నటించారు. వీళ్ల మధ్య వయస్సు తేడా 20-25 సంవత్సరాలు ఉంటుంది. అయితే కాజల్ అగర్వాల్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తో కూడా హీరోయినిగా చేసింది. అలాగే శృతి హాసన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో నటించింది. అలాగే బాలకృష్ణ తో కూడా సినిమాలు చేసింది. హీరో రవితేజ కూడా తన కూతురు వయస్సు ఉన్న హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇలా తమ కొడుకులు చేస్తున్న హీరోయిన్లు తోనే తండ్రలు కూడా సినిమాలు చేయడంతో కొన్ని విమర్సలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో హీరోలు తమ రూటు మార్చుకుని తమ వయస్సు ను దృష్టిలో పెట్టుకుని తంటాలు సరిపోయే పాత్రలు చేస్తే మంచింది. ఇదివరకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఒక కమెర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క తమ వయస్సు కు సరిపోయే పాత్రలు చేసేవారు. ఉదాహరణకు నాగేశ్వరరావు చేసిన ”సీతారామయ్య గారి మనవరాలు” సినిమా కానీ, అలాగే ఎన్టీఆర్ చేసిన ”మేజర్ చంద్రకాంత్”, “బడి పంతులు” సినిమాలు చేసారు. ఈ క్రమంలో నేటి తరం హీరోలు కూడా కథను, మంచు పాత్రలు ఉన్న సినిమాలు చేస్తే చూడడానికి బాగుటుంది. అయితే మార్పు రావాలంటే చూసే ప్రేక్షకుల మనస్తత్వం.. సినిమాలు తీసే హీరోలు, దర్శకులు ఆలోచనలు మారాలి. కొత్త దర్శకులు, యంగ్ హీరోలు ఈ మార్పుని తీసుకొస్తున్నారు, కానీ పూర్తిగా మారడానికి ఇంకా సమయం పట్టొచ్చు.