HomeజాతీయంTomato load:టమాటా లోడ్ మిస్సింగ్..

Tomato load:టమాటా లోడ్ మిస్సింగ్..

టమాటా లోడ్ మిస్సింగ్..

  • 11 టన్నుల టమాటాలతో వెళ్తున్న లారీ..
  • మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘటన

Tomato load ఇదే నిజం, నేషనల్ బ్యూరో: దాదాపు 11 టన్నులతో వెళ్తున్న టమాటా లోడ్ కనిపించకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బోపాల్ లో చోటు చేసుకున్నది. ఈ లోడ్ టమాటాల విలువ.. రూ.21 లక్షల ఉంటుందని అంచనా. కర్ణాటక లోని కోలార్‌ లో ఉన్న ఎస్‌వీటీ ట్రేడర్స్ యజమాని మునిరెడ్డి దుకాణం నుంచి 11 టన్నుల టమాటా లోడుతో లారీ రాజస్థాన్‌ లోని జైపుర్‌కు గురువారం బయల్దేరింది. శనివారం రాత్రి లారీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ టోల్‌ గేట్‌ దాటినట్లు మునిరెడ్డికి డ్రైవర్‌ సమాచారం అందించాడు. ఆదివారం ఉదయం లారీ ఎంత దూరం వెళ్లిందనే సమాచారం తెలుసుకునేందుకు మునిరెడ్డి డ్రైవర్‌కు ఫోన్ చేయగా.. నంబర్‌ అందుబాటులో లేదని వచ్చింది. లారీకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లోకేషన్‌ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనతో కోలార్‌ పోలీసులను ఆశ్రయించాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img