Homeహైదరాబాద్latest Newsభారీగా పడిపోయిన టమాటా ధరలు..! బోరున విలపిస్తున్న రైతులు..

భారీగా పడిపోయిన టమాటా ధరలు..! బోరున విలపిస్తున్న రైతులు..

నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని అంటిన టమాటా ధర సోమవారం భారీగా పడిపోయింది. మార్కెట్‌లో కిలో రూ. 20 నుంచి రూ. 30 వరకు ఉన్న టమాటా ధర.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమాట ధర ఒక్కసారిగా ఒక్క రూపాయికి పడిపోయింది. దీంతో పెట్టుబడులు, కౌలు, కనీసం కూలీ కూడా అందడం లేదని టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.. టమాటా రైతుల దుస్థితి లాటరీలా మారిందని, కనీసం రవాణా ఖర్చులు కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. హైదరాబాద్ టమాట రాకతో పత్తికొండ టమాట ధర పెరగడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Recent

- Advertisment -spot_img