తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన ‘బోనాలు’ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేసింది. రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడనున్నాయి. జులై 7న భాగ్యనగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ‘బోనాలు’ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది.