తెలంగాణలో రేపు కూడా పాఠశాలలకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం, గురువారం ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం బుధవారం ఒక్కరోజే సెలవు ఇవ్వగా, గురువారం ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే సెలవు ఉండేది, లేనిది విద్యార్థులకు సమాచారం అందించారు.