Homeహైదరాబాద్latest Newsరేపే అక్షయ తృతీయ.. ఇలా చేస్తే మంచిదట!

రేపే అక్షయ తృతీయ.. ఇలా చేస్తే మంచిదట!

అక్షయ తృతీయ మే 10 నుంచి ప్రారంభం కానుంది. అక్షయ అంటే తరగనిది అని అర్థం. ఆ రోజున బంగారం కొంటే లాభం కలుగుతుందని చాలా మంది భావిస్తారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనాలని ఏ పురాణంలోనూ లేదట. ఆరోజు దానం చేస్తే పుణ్యం వస్తుందట. జలదానం, అన్నదానం, వస్త్ర దానం చేస్తే దారిద్య బాధలు ఉండవని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన, చాలా పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదు. మద్యం సేవించకూడదు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనే వారు వెంటనే దానిని అలంకరించడం తప్పు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసిన వారు పెద్దల చేతుల మీదుగా పూజించిన తర్వాత దానిని అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని పెట్టుకోకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తే, అక్షయ తృతీయ మీకు సంపదలతో కూడిన అక్షయపాత్రను ఇస్తుంది. లేకుంటే అది పేదరికాన్ని తెస్తుంది.

Recent

- Advertisment -spot_img