భారత్-శ్రీలంక మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది. ఈ కీలక పోరుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరిగే కొలంబోలో ఉదయం భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఉదయం 10 గంటలకు 50 శాతం వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కొలంబో మైదానంలో మంచి డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం. కానీ వర్షం ఆగితేనే ఆటకు మైదానాన్ని సిద్దం చేయగలరు. ఆటకు సాధ్యం కాకపోతే మాత్రం రద్దు చేస్తారు. అప్పుడు బుధవారం జరిగే చివరి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారుతోంది.