రేపు ఓ ప్రత్యేకమైన ఖగోళ సంఘటనకు ఏప్రిల్ 24న బెంగళూరు నగరం సాక్ష్యంగా నిలువనుంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నం బెంగళూరులో కాసేపటికి నీడ అదృశ్యమవుతుంది. అయితే కొంత సమయం పాటు నీడ అదృశ్యమయ్యే రోజును ‘జీరో షాడో డే’ అంటారు. అంటే రేపు బెంగళూరులో ‘జీరో షాడో డే’… రేపు మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 గంటల వరకు ఆరు నిమిషాల పాటు బెంగళూరులో నీడ కనిపించకుండా పోతుంది. ఈ సందర్భంగా బెంగళూరులోని కోరమంగళ వద్ద ఉన్న క్యాంపస్‍లో ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) ఓ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్‍కు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.