రేపు (ఏప్రిల్ 25, 2025) తెల్లవారుజామున 5:30 గంటలకు ఆకాశంలో శుక్రుడు, శని, మరియు నెలవంక (చంద్రుడు) సమీపంగా వచ్చి ‘స్మైలీ ఫేస్’ ఆకృతిని ఏర్పరుస్తాయి. శుక్రుడు, శని రెండు కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం సూర్యోదయానికి ముందు కొద్ది సమయం మాత్రమే కనిపిస్తుందని నాసా తెలిపింది. దీన్ని కంటితో చూడవచ్చు, అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుంది.