‘దానా’ తుపాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ఈ తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది. అక్టోబర్ 23 నుంచి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో గంటకు 60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 24 రాత్రి నుండి అక్టోబర్ 25 ఉదయం వరకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ రాష్ట్రాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.