డైనమిక్ ఐఏఎస్ అధికారిణిగా మంచి పేరుని తెచ్చుకున్న ఆమ్రపాలి ఎట్టకేలకు ఏపీకి షిఫ్ట్ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టం మేరకు ఆమెను ఏపీకి కేంద్రం కేటాయించింది. అయితే ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇప్పటిదాకా కేటాయించలేదు. అయితే సీఎం చంద్రబాబు.. ఆమ్రపాలిని విజయవాడ నగరాభివృద్ధి సంస్థ కమిషనర్గా నియమిస్తారన్న ప్రచారం ఉంది. లేదా విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్గా కూడా నియమిస్తారని టాక్.