ఇదేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ లో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను యస్ఓటీ, మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్థరాత్రి మియాపూర్ లోని హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలోని ఓ ఇంటిపై యస్ఓటీ పోలీసులు దాడిచేశారు. నిర్వాహకురాలి తో పాటు ఓ విటుడ్ని, వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.