తెలుగు బిగ్బాస్ సీజన్ 8 హౌస్లో అడుగుపెట్టిన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ గుండెపోటుకు గురైందని పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ‘మై విలేజ్ షో’ టీమ్ సభ్యురాలు అంజిమామ స్పష్టం చేశారు. షో నిర్వాహకులకు ఫోన్ చేయగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు. గంగవ్వకు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. అయితే గంగవ్వ బిగ్ బాస్ సీజన్-4లో పాల్గొనగా, ఈ సీజన్లో మరోసారి వైల్డ్ కార్డ్ ద్వారా ప్రవేశించింది.