HomeతెలంగాణBJP: నలుగురి చెరలో బందీగా తెలంగాణ-బండి సంజయ్

BJP: నలుగురి చెరలో బందీగా తెలంగాణ-బండి సంజయ్

BJP: తెలంగాణ అభివ్రుద్ది కోసం గత 9 ఏళ్లలో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయిలకుపైగా కేటాయించింది. 4 కోట్ల మంది ప్రజల కోసం ఆ డబ్బును కేటాయిస్తే నలుగురు దోచుకుంటున్నా రని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ .ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం ఇఛ్చిన నిధులతోపాటు, చేసిన అభివ్రుద్ధిపై చర్చకు రమ్మంటే…. రాకుండా కేసీఆర్ పారిపోతున్నడు. బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుని దేశమ్మీద పడ్డారు‘‘అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ మూర్ఖత్వ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందన్నారు. ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే అన్ని వర్గాలు అసంత్రుప్తితో ఎందుకున్నాయో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను, అమరుల బలిదానాలను స్మరించుకున్నారు.


రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమకారులను స్మరించుకుంటూ, తెలంగాణ సాధన కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే… ‘‘మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం.‘‘అంటూ సుష్మ స్వరాజ్ పార్లమెంట్ వేదికగా చెప్పడమే కాక తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పాతికేళ్ల క్రితమే ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరుతో కాకినాడ తీర్మానం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు

మూర్ఖత్వ పాలన కొనసాగుతోంది


తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా మూర్ఖత్వ పాలన కొనసాగుతోంది. కేంద్రం 4 కోట్ల ప్రజల కోసం 4 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తే… కేసీఆర్ మాత్రం నలుగురి కోసం పంచుకుంటూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేసింది. అభివ్రుద్దిపై చర్చకు రమ్మని అడుగుతుంటే… చర్చకు రాకుండా కేసీఆర్ పారిపోతున్నడు… కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారమైతే… రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయి ఏ రైతన్నను పలకరించినా ఎందుకు కన్నీళ్లే కారుస్తున్నారో చెప్పాలి. అన్నం పెట్టిన చేతులు వడ్లకుప్పలపై జీవచ్చాలుగా మారినయ్? ఏ నిరుద్యోగ తమ్ముడిని పలకరించినా పటపట పళ్లు కొరుకుతున్నడు? ఏ కార్మికుడుని, ఉద్యోగిని కదిలించినా కసితో రగిలిపోతున్నడు… ఏ అక్క, చెల్లెమ్మను చూసినా రాణిరుద్రమ్మలా, కాళికాదేవిలా హుంకరిస్తోంది? తెలంగాణ సాధుంకున్నది ఇందుకోసమేనా అని బాధాతప్త హ్రుదయాలే కన్పిస్తున్నయని అన్నారు .
ఒక్కసారి ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమాలను గుర్తుకు చేసుకోండి. మిలియన్ మార్చ్, వంటా వార్పు, సకల జనుల సమ్మె స్పూర్తితో పోరాడదం.. బీజేపీతో కలిసి రావాలని కోరుతున్నా. బీఆర్ఎస్ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా బీజేపీ చేసే పోరాటాలకు కలిసి రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నానని చెప్పారు.

Recent

- Advertisment -spot_img