CYLINDERS BLAST:
కర్నూల్ నుంచి నెల్లూరు కు 300 గ్యాస్ సిలిండర్లతో వెలుతున్న లారీ భారీ ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అందులో ఉన్న 100 సిలిండర్లు పేలి పోవడంతో లారీ దగ్ధమైంది. ఈ భారీ ప్రమాదానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, జాతీయ రహాదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు భయంతో కంపించి పోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అరకిలోమీటరు దూరంలో వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చుట్టు పక్కల గ్రామాలను ఖాళీ చేయించారు. జాతీయ రహాదారిపై భయానక వాతావరణం నెలకొంది.