ETALA Rajender:
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం సాయంత్రం కొత్తకోట పట్టణంలోని చౌరస్తాలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకున్నారని లక్షల కోట్లు ప్రజలపై పెనుబారం వేశారని విమర్శించారు రాష్ట్రంలో ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం లేదని, దళిత బంధు ఏ ఒక్కరికి ఇవ్వలేదని అన్నారు. అధికారంలోకి వస్తే కెసిఆర్ రాష్ట్రాన్ని అమ్మే స్తారని ఫామ్ హౌస్ నుండే రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు . కెసిఆ ర్ ను గద్దె దించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, హుజురాబాద్ ఎన్నికల్లో దళిత బంధు వచ్చిందని, అన్ని వర్గాల పేదలకు దళిత బంధు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు