బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 హౌసులో ఫ్యామిలీ సీజన్ మొదలైంది. ప్రస్తుతం ఈ వారంతా ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. బిగ్‌బాస్ హౌసులోకి అందరి హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. అయితే ప్రతి ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వచ్చి వెళ్లినప్పుడు టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే గత వారం అతని వల్ల జరిగిన కొన్ని సంఘటనల వల్ల హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది అతడ్ని వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపిక చేసారు. వరస్ట్ కంటెస్టెంట్‌గా ఎంపికైనందున తేజ కుటుంబాన్ని ఫ్యామిలీ వీక్ రానివ్వడం లేదని నాగార్జున తెలిపారు. అయితే బిగ్‌బాస్ హౌస్‌కి రావడానికి అసలు కారణం ఈ ఫ్యామిలీ వీక్‌లో తన తల్లిని తీసుకురావడమేనని తేజ చెప్పాడు.
తాజాగా బిగ్‌బాస్ టేస్టీ తేజకి బిగ్‌బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హౌసులో తేజకి వల్ల అమ్మ ఫోన్ కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ లో తేజతో నేను ఇంట్లోకి రావడం లేదని వల్ల అమ్మ అంటుంది. దాంతో తేజ మరింత ఎమోషనల్ అవుతాడు. ఇంతలోనే హౌసులోకి టేస్టీ తేజ అమ్మ ఎంట్రీ ఇచ్చారు. హౌసులో తేజ తన తల్లిని చూడగానే చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. కుడి కాలు పెట్టి హౌసులోకి రావాలని తేజ వల్ల అమ్మకి చెపుతాడు. తన కల ఎట్టకేలకు నెరవేరిందని తేజ ఆనందపడ్డాడు.