Kisan Samman Nidhi : కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు మే ఆఖరి వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ మే ఆఖరి వారం లేదా జూన్ తొలి వారంలో అకౌంట్లోకి డబ్బులు పడతాయని తెలుస్తోంది. ఇ-కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రం 17వ విడత డబ్బులు పడతాయని తెలుస్తోంది. కేంద్రం.. ఎప్పుడూ ఇ-కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లొచ్చు. అక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం ద్వారా దీనిని పూర్తి చేయొచ్చు. ఇంకా.. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు. PM Kisan GOI App ద్వారా కూడా ఫేస్ అథెంటికేషన్‌తోనే కేవైసీ పూర్తి చేయొచ్చు.