ఏపీలో ఆర్టీసీకి ప్రస్తుతం టిక్కెట్ల రూపంలో నెలకు రూ.500 కోట్లు అందుతున్నాయి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలైతే నెలకు దాదాపు రూ.200 కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా. మరోవైపు ఆర్టీసీ ప్రభుత్వానికి నెలకు రూ.125 కోట్లు ఇస్తోంది. పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న రూ.125 కోట్లు నిలిపేయడంతో పాటు, మిగిలిన రూ.75 కోట్లను ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.