తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఇతర ప్రభుత్వ కార్యాలయాల సెలవులు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.