ఇదేనిజం, ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ చదువులున్న ఓ విద్యార్థి పరీక్ష మిస్ అయ్యానన్న మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకున్నది. మాంగూర్లకు చెందిన శివకుమార్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. పరీక్షలు రాయలేకపోయానన్న కారణంతో సాత్మల ప్రాజెక్టులో ప్రాణాలు తీసుకున్నాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ సుసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.