Homeజిల్లా వార్తలుప్రజా సమస్యల పరిష్కారం దిశగా జుక్కల్ ఎమ్మెల్యే తోట

ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జుక్కల్ ఎమ్మెల్యే తోట

ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావును ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజలు అయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి ధరఖాస్తులు తీసుకొని వారి సమస్యలు వింటూ వెంటనే ఆయా సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలు విని ధరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తుండటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం NDCC బ్యాంకు అధికారులతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు బుధవారం సమావేశమయ్యారు. బ్యాంకుకు వచ్చే ప్రతి రైతుకు రుణమాఫీ పై పూర్తి వివరాలు ఇచ్చి వారికి సలహా సూచనలు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. రైతుల ఖాతాల్లో దొర్లిన తప్పును సరి చేసి వాటిని పై అధికారులకు నివేదించి రుణమాఫీ అందేటట్లు చూడాలని తెలిపారు.

Recent

- Advertisment -spot_img