–మలయాళీ బుల్లి తెర ఇండస్ట్రీలో మరో విషాదం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మలయాళీ టీవీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నటీమణులు అపర్ణా పి.నాయర్, రెంజూషా మేనన్ మరణవార్తలను మరవకముందే మరో సీరియల్ నటి ప్రియ (35) కన్నుమూశారు. 8 నెలల గర్భవతిగా ఉన్న ప్రియ మంగళవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు సహ నటుడు కిషోర్ సత్య వెల్లడించాడు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘మలయాళీ టీవీ ఇండస్ట్రీలో ఊహించని విధంగా మరొకరు మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్‌తో ప్రియ కన్నుమూశారు. ఆమె ఎనిమిది నెలల ప్రెగ్నెంట్. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యల్లేవు. రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లిన ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురై మృతి చెందారు. ఆమె కార్డియాక్ అరెస్ట్‌కు గురవడంతో వెంటనే స్పందించిన డాక్టర్లు.. ఆమెకు డెలివరీ చేసి శిశువును బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యం బాగానే ఉంది. బేబీకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబసభ్యుల ఆవేదన నన్నెంతో కలచివేసింది. వాళ్లను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. మంచివాళ్లకు భగవంతుడు ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తాడో..?’అని ఆయన పోస్ట్ పెట్టారు. వృత్తి రీత్యా డాక్టరైన ప్రియ.. సీరియల్ నటిగానూ మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్నారు. కిషోర్ సత్య నటించిన ‘కరుతముత్తు’ అనే సీరియల్‌తో ఆమె నటిగా పేరు సొంతం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె నటనకు కాస్త దూరంగా ఉన్నారు.